Mon Dec 23 2024 07:22:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సర్కార్ కు డెడ్లైన్
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకూ డెడ్ లైన్ విధించినట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు చెప్పారు
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకూ డెడ్ లైన్ విధించినట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ వరకూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. గత మూడున్నరేళ్ల నుంచి అనేక ఉద్యోగ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఇంతవరకూ సమస్యలను పరిష్కరించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
ఈ నెల 26వ తేదీ వరకూ....
తమకు డీఏలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలసి వచ్చే ఉద్యోగ సంఘాలతో కలసి పోరాటాన్ని రూపొందించుకుంటామని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వం కల్పించవద్దని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఎన్ని సార్లు సమావేశమైనా సమస్యలు పరిష్కరిస్తామన్న హామీలు తప్పించి, కార్యరూపంలో కన్పించడం లేదని ఆయన అన్నారు.
Next Story