Sun Dec 22 2024 18:41:09 GMT+0000 (Coordinated Universal Time)
కేబినెట్ విస్తరణ సీఎం ఇష్టం.. ఎలాగైనా నాకు ఓకే
మంత్రి వర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆయన అభిప్రాయాన్ని తాము గౌరవిస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
మంత్రి వర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆయన అభిప్రాయాన్ని తాము గౌరవిస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి అభిమతంతోనే కేబినెట్ ఉంటుందని, తాను కాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాని ముఖ్యమంత్రి అభిప్రాయానికి గౌరవిస్తానని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
లైన్ దాటను...
పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలన్నది పార్టీ అధినేత ఇష్టమన్నారు. తాను సీనియర్ నని, రాజకీయాల్లోనే పుట్టానని, పార్టీ లైన్ ను దాటి వెళ్లనని బొత్స సత్యనారాయణ తెలిపారు. జగన్ ఇష్టాయిష్టాలను గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story