Fri Dec 27 2024 10:05:54 GMT+0000 (Coordinated Universal Time)
బాక్సులో ఏముంది?
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె ఒకింత కలకలం రేపింది. వంద టన్నుల బరువున్న పెట్టె తీరప్రాంతానికి కొట్టుకొచ్చింది
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె ఒకింత కలకలం రేపింది. దాదాపు వంద టన్నుల బరువున్న పెట్టె సముద్ర తీరప్రాంతానికి కొట్టుకు రావడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బాక్సు బరువు వంద టన్నులుంది. అయితే ఈ బాక్సులో ఏముందన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు వచ్చి బాక్సు వద్ద పహారా కాస్తున్నారు.
ఆర్కియాలజీ విభాగానికి...
అయితే పోలీసులు ప్రొక్లెయిన్ సాయంతో విశాఖ తీరం నుంచి బయటకు తీసుకు వచ్చారు. అయితే చూసే దానికి ఈ బాక్స్ బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఆర్కియాలజీ విభాగం అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాతనే బాక్సులో ఏముందన్నది తెలియాల్సి ఉంది. నదీతీరానికి కొట్టువచ్చిన ఈ బాక్సును చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు విశాఖ తీరానికి చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించడం కష్టంగా మారింది.
Next Story