Fri Dec 27 2024 09:50:15 GMT+0000 (Coordinated Universal Time)
చెక్క పెట్టే అది.. ఏం లేదట బాబూ
విశాఖ నదీ తీరానికి కొట్టుకు వచ్చిన బాక్సు కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించారు
విశాఖ నదీ తీరానికి కొట్టుకు వచ్చిన బాక్సు కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో బాక్సును ఓపెన్ చేశారు. కానీ అవి చెక్కలుగానే గుర్తించారు. బాక్సులో ఏమీ లేదు. వరసల వారీగా చెక్కలతో తయారు చేసిన బాక్సుగా అధికారులు గుర్తించారు.
ఏదో ఉంటుందని...
ఇందులో ఏదో ఉంటుందని ఉదయం నుంచి హైరానా పడ్డారు. విశాఖ నదీ తీరానికి కొట్టువచ్చిన బాక్సు వంద టన్నుల బరువు ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే బ్రిటీష్ కాలంలో దీనిని సాధారణంగానే ఉపయోగించే వారని చెబుతున్నారు. బాక్సులో ఏమీ లేదని తేలడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story