Mon Dec 23 2024 13:18:32 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లాడిని ఆ ఏడుకొండల వాడే కాపాడాడు
అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. చిన్నారిని శ్రీవారే రక్షించారని
అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. చిన్నారిని శ్రీవారే రక్షించారని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిన్నారిని వైద్యులు డిశ్చార్జి చేశారు. వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూన్ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగిందని, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగిందని అన్నారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని.. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పారు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాలుడి తల్లిదండ్రులు స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిరుత దాడి జరిగిన 15 నిమిషాల్లో టీటీడీ అధికారులు స్పందించారని, ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యంతో తమ బిడ్డను తిరిగి అప్పగించారని తెలిపారు.
Next Story