Thu Nov 14 2024 22:15:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోరోజుకు బ్రహ్మోత్సవాలు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి.స్వామిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం హనుమంత వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో ఊరేగారు. సాయంత్రం నాలుగు గంటలకు పుష్పక విమానంలో విహరిస్తారు. స్వామి వారిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. తిరుమల గిరులన్నీ గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. మాడ వీధులన్నీ భక్త జన సంద్రంతో నిండిపోయాయి.
ఎనిమిది గంటల సమయం...
మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్వనం క్యూలైన్లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,757 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,395 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story