Mon Dec 23 2024 13:46:49 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి
తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తొమ్మిదిరోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు తిరుమలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రధానంగా గరుడ వాహనం రోజు లక్షల సంఖ్యలో రావడంతో అన్ని రకాలుగా భద్రతపరమైన చర్యలు తీసుకుని, ప్రశాంతంగా జరిపామని తెలిపారు.
తిరుమలలో రద్దీ....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోని భక్తులకు ఎనిమిది గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 29,209 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story