Mon Dec 23 2024 15:22:12 GMT+0000 (Coordinated Universal Time)
కల్పవృక్ష వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ మాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామి వారిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. వేల సంఖ్యలో భక్తులు హజరై ఏడుకొండల వాడిని వివిధ రూపాల్లో దర్శించుకుంటున్నారు. నాలుగు మాడ వీధుల్లోనూ స్వామి వారి రాకకోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. భక్తుల భజనలు, కోలాటలతో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లుతున్న వాహనసేవలను చూసి తరించాల్సిందే.
రాత్రికి సర్వ భూపాల వాహనం...
బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ కల్పవృక్ష వాహనంపై స్వామి వారు విహరిస్తారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారి అనుగ్రహం కోసం వేలాది మంది భక్తులు మాడ వీధుల్లో ఎదురు చూస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడంతో అందరికీ సర్వదర్శనం ద్వారానే భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది.
Next Story