Mon Dec 23 2024 16:00:13 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రెండ్రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు
ఉగాది సందర్భంగా ఆ రెండ్రోజులు ఎవరి సిఫారసు లేఖల్నీ స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. మార్చి 22న
ఈ నెల 22న తెలుగు సంవత్సరాది అనగా ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) పర్వదినం. ఈ నేపథ్యంలో మార్చి 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉగాది సందర్భంగా ఆ రెండ్రోజులు ఎవరి సిఫారసు లేఖల్నీ స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. మార్చి 22న శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం రోజున సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.
22వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకు విశేష సమర్పణ ఉంటుంది. 7 గంటల నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేస్తారు. తదుపరి స్వామివారి మూల విరాట్టును, ఉత్సవ మూర్తులను నూతన వస్త్రాలతో అలంకరించి, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
Next Story