Mon Dec 23 2024 13:43:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు
కరోనా మొదలు.. ఇప్పటి వరకూ అత్యల్ప కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి కావొచ్చని అంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ..
అమరావతి : ఏపీలో కరోనా రోజువారి కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా రోజు వారీ కొత్త కేసులు 10కి దిగువన నమోదయ్యాయి. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా మొదలు.. ఇప్పటి వరకూ అత్యల్ప కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి కావొచ్చని అంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. 8,219 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ను పరిశీలించగా.. 5 గురికి మాత్రమే కరోనా నిర్థారణ అయింది.
ఇదే సమయంలో మరో 37 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణం సంభవించలేదు. ఏపీలో ఇప్పటి వరకూ 3,34,15,605 శాంపిల్స్ ను పరీక్షించగా.. 23,19,509 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వారిలో 23,04,465 మంది కోలుకోగా.. 14,730 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 314 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Next Story