Fri Nov 22 2024 23:34:40 GMT+0000 (Coordinated Universal Time)
తక్కువ మార్కులు.. సూర్యనారాయణపురం స్కూల్ లో శిక్ష విధించారంటే?
చదువు అంటే.. మార్కులు, ర్యాంకులు అన్నట్లుగా తయారైంది ఈ లోకంలో
చదువు అంటే.. మార్కులు, ర్యాంకులు అన్నట్లుగా తయారైంది ఈ లోకంలో..! మార్కులే పిల్లల ట్యాలెంట్ కు కొలమానాలుగా భావిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. మార్కులు బాగా తెచ్చుకుంటేనే ఈ లోకంలో నెగ్గుకురాగలవు.. మంచి ర్యాంకులు వస్తేనే గొప్ప స్టూడెంట్ లాంటివి మనం మన ఇళ్లల్లోనే వింటూ ఉంటాం. తక్కువ మార్కులు వచ్చాయని శిక్షించే తల్లిదండ్రులు, టీచర్లు కూడా తక్కువేమీ కాదు.
తాజాగా కాకినాడ లోని సూర్యనారాయణపురంలో తక్కువ మార్కులు వచ్చాయని ఓ ఉపాధ్యాయుడు పిల్లల జుట్టు కత్తిరించాడు. సూర్యనారాయణపురంలో ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని జుట్టు కత్తిరించారు హెడ్ మాస్టర్. మొత్తం 9 మంది పిల్లల జుట్టు కత్తిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకు దిగారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్ దగ్గరకు చేరడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. హెడ్ మాస్టారు పై కేసు నమోదు చేశారు. పిల్లలను, ప్రధానోపాధ్యాయుడిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story