Mon Dec 23 2024 10:49:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మోసం... దళారుల ఛీటింగ్
విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తామని దళారులు మోసం చేశారు. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం దళారుల చేతుల్లో మోసపోయింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే అందరికీ కష్టం. అందులోనూ వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల దొరకడం మహా కష్టం. అందుకే దళారీలు భక్తులను మోసం చేస్తుంటారు. విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తామని దళారులు మోసం చేసిన ఘటన తిరుమలలో జరిగింది. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం దళారుల చేతుల్లో మోసపోయింది.
బెంగళూరుకు చెందిన...
బెంగళూరుకు చెందిన సిద్దలింగప్ప కుటుంబంతో తిరుమల వచ్చారు. తమ కుటుంబ సభ్యలు మొత్తం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకున్నారు. వీరిని దళారులు వేణుగోపాల్, రవి కలిశారు. తాము దర్శనం చేయిస్తామని నమ్మబలికారు. సిద్ధలింగప్ప నుంచి రూ.24000లు వసూలు చేశారు. అయితే టిక్కెట్లు ఏవీ ఇప్పించకుండా వారు మోసం చేయడంతో సిద్దలింగప్ప విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది.
Next Story