Mon Dec 23 2024 19:19:41 GMT+0000 (Coordinated Universal Time)
న్యాయం చేస్తాం.. ఢిల్లీకి వెళ్లకు
ఏపీ రాష్ట్రంలోని NTR జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళకు చెందిన నాగ దుర్గారావు తన సోదరిని 2018లో చందాపురంవాసి నరేంద్రనాథ్..
చందర్లపాడు : తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నేల వెళ్లివెల్లి నాగ దుర్గారావు న్యూఢిల్లీ కి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే..! ఐదు రోజుల కిందట చేపట్టిన ఎడ్లబండి యాత్ర వరంగల్ సమీపంలో డోర్నకల్ చేరాక ఆగిపోయింది. శుక్రవారం రాత్రి నాగ దుర్గారావును పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తాం వెనక్కు రావాలని పెద్ద మనుషులు, పోలీసులు కోరడంతో దుర్గారావు అందుకు అంగీకరించారు.
ఏపీ రాష్ట్రంలోని NTR జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళకు చెందిన నాగ దుర్గారావు తన సోదరిని 2018లో చందాపురంవాసి నరేంద్రనాథ్ కిచ్చి పెళ్లి చేశారు. కట్నకానుకల కింద 23 లక్షల నగదు, నగలతోపాటు మూడు ఎకరాల పొలం ఇచ్చినట్లు చెబుతున్నారు. వివాహం అనంతరం భర్త వేధింపులు మొదలయ్యాయి. అత్తింటివారు సైతం బెదిరించి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు వేధింపులపై చందర్లపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయినా..అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో ఎలాంటి పురోగతీ లేదని ఆరోపించాడు. తమకు న్యాయం దొరకదని నిర్ణయానికి వచ్చి ఎడ్ల బండిపై హస్తినకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు నాగ దుర్గారావు. దుర్గారావు న్యాయ పోరాటంపై ఏపీ ఉన్నతాధికారులు స్పందించారు.
సోదరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తూనే.. ఢిల్లీ పయనం విరమించుకోవాలని నచ్చజెప్పారు. నాగ దుర్గారావు నిర్ణయం సరైందికాదని న్యాయవాది అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లటం న్యాయపరంగా చిక్కులు ఎదురౌవుతాయన్నారు. కిందిస్థాయిలో న్యాయం జరగకుంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలని.. అకారణంతో ఎడ్లను హింసించటం నేరమవుతుందని తెలిపారు. ఇక్కడ అన్యాయం జరిగే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసేందుకు నవ్యత సోదరుడు దుర్గారావు, తల్లి జ్యోతి తో కలిసి ఎడ్లబండిపై ఈ నెల 23న ఢిల్లీ యాత్ర చేపట్టారు.
ఎడ్లబండి యాత్రపై మీడియాలో కథనాలు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెద్ద మనుషులు, పోలీసులు డోర్నకల్ సమీపంలో దుర్గారావు కలిశారు. న్యాయం జరిగేలా చూస్తానని నాకు చెప్పి బలవంతంగా దుర్గారావును ఆయన తల్లిని గ్రామానికి తీసుకు వచ్చారు. తన చెల్లి కి న్యాయం చేయాలని తాము ఇచ్చిన కట్న కానుకలు తిరిగి ఇవ్వాలని తమపై వేసిన పరువు నష్టం కేసును, ఇతర కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన చెల్లికి న్యాయం జరగని పక్షంలో తిరిగి యాత్ర చేస్తానని దుర్గారావు చెప్పారు.
Next Story