Thu Dec 26 2024 22:18:33 GMT+0000 (Coordinated Universal Time)
చిల్లర రాజకీయాలు మానుకోండి
తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్కక్షుడు తోట చంద్రశేఖర్ స్పందించారు
తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్కక్షుడు తోట చంద్రశేఖర్ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తనపై చేసిన ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తనకు నాలుగువేల కోట్ల విలువైన స్థలాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.
90 శాతం భూమిని వారికే ఇస్తా...
ఖమ్మం బీఆర్ఎస్ సభ వద్ద తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. పనికి మాలిన ఆరోపణలను బీజేపీ నేతలు మానుకోవాలని తోట హితవు తెలిపారు. అదే నిజమని భావిస్తే ఆ సర్వే నెంబరు లో తనకు ఉన్న భూమిలో 90 శాతం వారినే తీసుకోవాలని, మిగిలిన పది వాతం తనకు ఇస్తే చాలునని తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని తోట చంద్రశేఖర్ అన్నారు.
Next Story