Wed Dec 25 2024 21:00:46 GMT+0000 (Coordinated Universal Time)
లింగమనేని నన్ను ఛీటింగ్ చేశారు
లింగమనేని రమేష్ తనను మోసం చేశారని చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు అన్నారు
లింగమనేని రమేష్ తనను మోసం చేశారని చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు అన్నారు. దాదాపు 310 కోట్ల రూపాయలు తమకు ఎగ్గొట్టారన్నారు. పది చెక్కులు తమకు లింగమనేని రమేష్ ఇచ్చినా అవి చెల్లకుండా పోయాయని అన్నారు. లింగమనేని రమేష్ తమను కావాలనే మోసం చేశారన్నారు.
ఆరు ఎఫ్ఐఆర్లు...
లింగమనేని రమేష్ ఛీటింగ్ పై హైదరాబాద్ సీసీఎస్ లో కేసులు నమోదయ్యాయని బీఎస్ రావు తెలిపారు. మొత్తం ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని బీఎస్ రావు తెలిపారు. నెలవారీగా తమకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.
Next Story