Mon Dec 23 2024 15:43:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆళ్ల దొంగ సర్టిఫికేట్ మాటేంటి? బుద్దా ట్వీట్
నకిలీ సర్టిఫికేట్లను పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు
నకిలీ సర్టిఫికేట్లను పెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. తన బాస్ జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి 1993లో మైసూరు ఓపెన్ యూనివర్సిట ీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పట్టాను తెచ్చుకున్నారని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ఆ సర్టిఫికేట్లను కూడా జత చేశారు.
మూడేళ్లకు ముందే....
అయితే 2014 ఎన్నికల్లో ఆళ్ల ఆ సర్టిఫికేట్ పెడితే, ఆ సంస్థ 1996లో స్థాపించిందని, 1993లో సర్టిఫికేట్ ఆళ్లకు ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మైసూరు ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభానికి మూడేళ్ల ముందే ఆళ్లకు సర్టిఫికేట్ ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న నిలదీశారు. 2019 ఎన్నికల అఫడవిట్ లో ఆళ్ల మాస్టర్ డిగ్రీ కాస్తా డిప్లొమా డిగ్రీ అయిందని వెంకన్న ఎద్దేవా చేశారు. అలాంటి ఆళ్లను వదిలేసి అశోక్ బాబుపై నిందలు వేయడమేంటని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Next Story