Sun Dec 22 2024 22:12:49 GMT+0000 (Coordinated Universal Time)
Buddha Venkanna : నానీ .. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావ్.. అన్ని మాటలంటావా?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని కామెంట్స్ కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని తనకు చంద్రబాబు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదన్నారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబును అనరాని మాటలంటావా? అని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు తనతో నిన్ను తిట్టించాడని అబద్దాలు చెబుతావా? అని అడిగారు. చంద్రబాబు కాళ్లు తాను మొక్కుతానని, ఆయన తన దేవుడని అన్నారు.
ముందు అప్పులు చెల్లించి...
నువ్వు అప్పులున్నవారికి ముందు అప్పులు ఇవ్వమని కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. నీ చిట్టా అంతటా తాను బయటపెడతానని అన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్టు అంటూ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానికి, చిన్నికి 1999 నుంచి గొడవలున్నాయని, ఆటోనగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయి ఉన్నారన్నారు. చంద్రబాబు నీ కుటుంబంలో చిచ్చు పెట్టారంటావా? అని అన్నారు. నువ్వేంది నీ స్థాయి ఏంది నానీ.. చంద్రబాబును తిట్టే స్థాయి నీకు లేదని అన్నారు. లోకేష్ బాబు పాదయాత్రపై అవాకులు చవాకులు పేలతావా? ఖబడ్దార్ నానీ అంటూ ఫైర్ అయ్యారు. దున్నపోతులా ఉన్న నువ్వు ఒక్కరోజైనా కొడాలి నాని, వల్లభనేని వంశీపై మాట్లాడావా అని ప్రశ్నించారు.
Next Story