Fri Apr 18 2025 16:05:49 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. భద్రతను మరింత పెంచారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. ఈ నెల 8వ తేదీన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సభ నివాళులర్పిస్తుంది.
కీలక అంశాలు....
అయితే తొలుత సభకు దూరంగా ఉండాలనుకున్న టీడీపీ హాజరు కావాలని నిర్ణయించింది. చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరుకానున్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు, జిల్లాల విభజన, ఉద్యోగుల పీఆర్సీ వంటి కీలక అంశాలను చర్చించనున్నారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది రేపు జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
Next Story