Mon Dec 23 2024 07:13:06 GMT+0000 (Coordinated Universal Time)
బుగ్గన బుగ్గన పెట్టుకుని వచ్చి అప్పజెప్పారే?
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు తీర్మానాన్ని శాసనమండలిలో బుగ్గన ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనమండలిలో మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి నిన్న శాసనసభలో చేసిన ప్రసంగాన్ని రిపీట్ చేశారు. అవే అంశాలను తిరిగి పెద్దల సభలోనూ మాట్లాడారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు మరో తీర్మానాన్ని శాసనమండలిలో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
సేమ్ రిపీట్...
అయితే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదు. నిన్న శాసనసభలో చెప్పిన అంశాలనే యధాతధంగా మండలిలోనూ అప్పజెప్పారు. తాను రాసుకున్న అంశాల్లో పెద్దల సభలో కొంత మార్పు చేయాల్సి ఉన్నా బుగ్గన ఆ ప్రయత్నం చేయలేదు. నిన్నటి బుగ్గన ప్రసంగంపై కొన్ని విమర్శలు వచ్చాయి. కొన్ని తప్పులు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. కానీ వాటిని సరిదిద్దు కునే ప్రయత్నం కూడా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి చేయలేదు.
Next Story