Mon Dec 23 2024 04:36:54 GMT+0000 (Coordinated Universal Time)
Devaragattu : నేడు దేవరగట్టులో కర్రల సమరం.. పోలీసు ఆంక్షల మధ్యే
దేవర గట్టులో నేడు బన్నీ ఉత్సవం జరగనుంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సిద్ధమయింది.
దేవర గట్టులో నేడు బన్నీ ఉత్సవం జరగనుంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సిద్ధమయింది. పోలీసు ఆంక్షలున్నప్పటికీ గ్రామ ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తుండటంతో వాటిని లెక్క చేయడం లేదు. అనేక మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని, బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈరోజు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం సంప్రదాయంగా వస్తుంది. కర్రలతో కొట్టుకోవడం వల్ల తలలు పగులుతాయి. రక్తం చిందుతుంది.
ఉత్సవ విగ్రహాల కోసం...
అనేక మంది గాయాలపాలవుతారు. అయినా సరే కర్రల సమరంలో పాల్గొనేందుకు గ్రామస్థులు పోటీ పడతారు. మాల మల్లేశ్వర కల్యాణోత్సవంతో పాటు బన్నీ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల కోసం గ్రామాల ప్రజలు కర్రల సమరానికి దిగుతారు. ఈ సమరంలో మొత్తం ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అయితే పోలీసులు గ్రామంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కర్రలతో గట్టిగా కొట్టుకోవద్దంటూ గ్రామాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. హింసాత్మకంగా మార్చవద్దంటూ పదే పదే చెబుతున్నా గ్రామస్థులు మాత్రం తమ సంప్రదాయాన్ని వీడటం లేదు.
భారీ పోలీసులు
భారీ పోలీసులు మొహరించారు. దీంతో పాటు గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. సెంటిమెంట్ గా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుండటంతో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, కేసులు పెట్టినా గ్రామస్థులు మాత్రం పూనకాలు వచ్చినట్లు ఈరోజు అర్థరాత్రికి ఊగిపోతారు. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రాణాపాయం కలగకుండా వెంటనే చికిత్స అందేలాల ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ ఉత్సవానికి వేలాది మంది తరలి వస్తుండటంతో పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థిితి. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తుంటారు
Next Story