Sat Dec 28 2024 23:07:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చేతిలో డబ్బులేవీ? కూటమి ప్రభుత్వంపై జనం ఏమనుకుంటున్నారంటే?
గత ప్రభుత్వంలో అలవాటయిన బటన్ నొక్కే కార్యక్రమం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు
గత ప్రభుత్వంలో అలవాటయిన బటన్ నొక్కే కార్యక్రమం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. 2019 నుంచి 2024 వరకూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రాధాన్యతలు వేరు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందచేయాలనుకుంటున్నారు తప్పించి నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పెద్దగా సుముఖత చూపరు. అందుకే గత ఏడు నెలల నుంచి బటన్ నొక్కడం అనేది లేదు. జనాల ఖాతాల్లో కూడా నగదు కనపడటం లేదు. కేవలం పింఛనుదారులకు మినహా ఇప్పటి వరకూ ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది లేదనే చెప్పాలి. అందుకు రాష్ట్ర ఖజానా కూడా ఒక కారణమని అధికార పార్టీ చెబుతుంది.
గతంలో అలవాటయి...
గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు నెలలో ఒకటి రెండు సార్లు ఎవరో ఒకరికి బటన్ నొక్కి నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. వారికి ఆర్థికంగా ఇవి ఉపయోగపడేవి. అమ్మఒడి, వసతి దీవెన, చిరు వ్యాపారులు, చేనేతలు, మత్స్యకారులు ఇలా అన్ని సామాజికవర్గాల వారికి కూడా క్యాలెండర్ ను రూపొందించుకుని మరీ నగదును జమ చేసేవారు. తమకు ఈ డబ్బులు గ్యారంటీగా వస్తాయని భావించేవారు. సంక్రాంతి పండగను హుషారుగా ఆనందంగా జరుపుకునే వారు. కానీ గడిచిన ఏడు నెలల నుంచి రూపాయి కూడా బ్యాంకు అకౌంట్ లో పడకపోవడంతో ఒకింత అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం. బ్యాంకు ఖాతాల్లో నగదు లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందన్నా...
గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్లిందని, ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ దానిని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే తమకు అవన్నీ అనవసరం. తమకు అవసరమైనది నగదు. అది అందనప్పుడు అభివృద్ధి, సంక్షేమం అంటూ ప్రకటనలు తమకు కూడు బెడతాయా? ని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉండటంతోనే ప్రజలకు తొలి రెండు నెలల్లోనే అర్థమయింది. చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తారు. ఆ రెండు దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. అప్పుడు ఆర్థికంగా పేదలు బలపడతారని భావిస్తున్నారు.
గ్రామాల్లో నిలదీత మొదలు...
కానీ జనం మాత్రం అలా అనుకోవడం లేదు. తమకు ఎలాంటి నగదు ఇవ్వకపోవడమేంటని కొందరు ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను నిలదీసే పరిస్థితికి గ్రామాల్లో వచ్చిందని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే గ్రామస్తులకు నచ్చచెప్పలేక వెనుదిరిగారు. ప్రభుత్వం పాలసీ ప్రకారం వెళుతుంది. రహదారులు బాగాలేకున్నా, రాష్ట్రానికి రాజధానికి లేకున్నా వారికి ఫరక్ పడదు. తమకు అలవాటుగా మారిన నగదు బ్యాంకు ఖాతాల్లో కనిపించకపోయే సరికి ఆ ఫ్రస్టేషన్ ను ప్రజా ప్రతినిధులపై చూపిస్తున్నారంటున్నారు. అయితే ఏడు నెలలే అయినందున ప్రభుత్వం తన ప్రాధాన్యతలను అమలు చేస్తుందని, గతంలో జగన్ కూడా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల తర్వాతనే పథకాలు అమలు చేశారని, తాము కూడా అంతేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కూటమి పార్టీ పాలనపై మాత్రం తమకు నగదు బదిలీ చేయడం లేదన్న అసంతృప్తి మాత్రం గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు.

Next Story