Mon Dec 23 2024 10:49:53 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీవాసులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే నిత్యావసరాలు
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమయింది
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధర ల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చ టమోటా, ఉల్లి నిల్వ చేసుకునే పద్ధతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించిన మంత్రులు, అధికారులు ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా బియ్యం ధరల స్థిరీకరణ జరిగినట్లు గుర్తించారు.
ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాలు...
ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా తగ్గిన కందిపప్పు ధరలు కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. పెరిగిన వంటనూనె ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిటందన్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లీటర్ పామాయిల్ రూ.110 అమ్ముతున్న ప్రభుత్వం దిగుమతి దారులు, హోల్ సేల్ నిర్వాహకులు, రిటైల్ దారులతో ప్రభుత్వం చర్చలు జరిపి అనంతరం రాయితీ ధరలపై వంటనూనెను అమ్మకానికి క్యూ ఆర్ కోడ్ ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారని తెలిపింది.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కందిపప్పు పంచదారను సబ్సిడీ ధరలకు సప్లై చేయడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార అర్థ కేజీ 16 రూపాయలు, పామాయిల్ లీటర్ 110 రూపాయలకు రైతు బజార్ తో పాటు రాష్ట్రంలోని 2200 రిటైల్ అవుట్ల ద్వారా సబ్సిడీ ధరలకు అమ్మకం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
Next Story