Thu Dec 26 2024 00:39:09 GMT+0000 (Coordinated Universal Time)
7న ఏపీ మంత్రి వర్గ సమావేశం.. అందుకే
ఈనెల 7న ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగబోతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు
ఈనెల 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గానికి ఇదే చివరి సమావేశం కావచ్చు. ఈ నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు.
చివరి సారి..
అందుకే చివరి సారి ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారంటున్నారు. ఈ సమావేశంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం లోపు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలను రూపొందించి పంపాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
Next Story