Mon Dec 23 2024 11:06:58 GMT+0000 (Coordinated Universal Time)
అంగన్వాడీవర్కర్లరతో నేడు చర్చలు
అంగన్ వాడీ వర్కర్లతో మరికాసేపట్లో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది
అంగన్ వాడీ వర్కర్లతో మరికాసేపట్లో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. దాదాపు నెల రోజుల నుంచి ఏపీలో అంగన్ వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నెలకు 24 వేల వేతనంతో పాటు పింఛను కూడా చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు.
ఎస్మా ప్రయోగించినా...
అయితే ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి కొన్ని డిమాండ్లకు మాత్రం తలొగ్గింది. వేతనాల విషయంలోనే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వారు కోరిన జీతాన్ని అమలు చేస్తామని చెప్పింది. అందుకు అంగన్వాడీ వర్కర్లు వినడం లేదు. దీంతో ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లపై ఎస్మాను కూడా ప్రయోగించింది. మున్సిపల్ కార్మికుల తరహాలోనే అంగన్ వాడీ వర్కర్లతో జరిగే చర్చలు కూడా సఫలమవుతాయని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story