Mon Dec 23 2024 04:00:06 GMT+0000 (Coordinated Universal Time)
గేదెకు పంది రూపంలో దూడ జననం.. ఎక్కడో తెలుసా?
కొన్ని కొన్ని వింతలను చూస్తుంటే ఆశ్చర్యపోక మానదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతాలను చూసేందుకు..
కొన్ని కొన్ని వింతలను చూస్తుంటే ఆశ్చర్యపోక మానదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతాలను చూసేందుకు జనాలు క్యూ కడుతుంటారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగిన ఓ వింత అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. జీలుగుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. అంజిబాబు అనే రైతుకు చెందిన ఓ గేదెకు దూడ జన్మించింది. కానీ ఆ దూడ పంది రూపంలో ఉండటం అందరు ఆశ్యర్యపోతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ పంది రూపంలో ఉన్న దూడను చూసి జన్యుపరమైన లోపాలుగా చెబుతున్నారు. మరి కొందరు పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు జరుగుతుందని చెప్పుకొంటున్నారు. ఏదేమైనా ఇది వింతేనని చెప్పాలి. సాధారణంగా గేదెకు పుట్టే దూడ రూపం ఉండకుండా వరహా (పంది) రూపం ఉండటం వింతగా చెప్పవచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం
అజయ్య దగ్గర ఉన్న గేదెలలో ఒక గేద చూలు కట్టి నెలలు నిండడంతో దానికి ఓ దూడ జన్మించింది. అయితే ఆ దూడను చూసిన అంజిబాబు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఆ దూడ చూడడానికి అచ్చం వరాహ (పంది) రూపంలో ఉంది. దాని మెడ ,కాళ్లు , చెవులు, తోక వరాహానికి ఏ విధంగా ఉంటాయో అలానే ఉన్నాయి. దీంతో తన గేదకు పుట్టిన వింత దూడ సమాచారాన్ని బంధువులకు స్థానికులకు తెలియజేశారు. వరాహ రూపంలో ఉన్న వింత దూడను చూసేందుకు స్థానికుల సైతం ఎక్కువగా ఆసక్తి చూపించారు.
అయితే ఆ వింత దూడ మాత్రం పుట్టిన వెంటనే చనిపోయింది. ఈ దూడ జననంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పశు వైద్యులు మాత్రం జన్యుపరమైన లోపాల కారణంగానే ఈ విధంగా దూడ జన్మించిందని చెబుతుంటే మరికొందరు మాత్రం పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో గేదెకు వరాహం పుడుతుందని రాసి ఉందని, ఆ ప్రకారంగానే ఇప్పుడు జరిగిందని అంటున్నారు.
Next Story