Mon Dec 23 2024 01:52:17 GMT+0000 (Coordinated Universal Time)
ప్యాకేజీ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా?
ప్యాకేజీ తీసుకోలేదని సింహాద్రి అప్పన్న వద్ద ప్రమాణం చేయగలవా? అని పవన్ కల్యాణ్ ను మంత్రి గుడివాడ అమరనాథ్ సవాల్ విసిరారు
ప్యాకేజీ తీసుకోలేదని సింహాద్రి అప్పన్న వద్ద ప్రమాణం చేయగలవా? అని పవన్ కల్యాణ్ ను మంత్రి గుడివాడ అమరనాథ్ సవాల్ విసిరారు. కన్నతల్లి మీద ప్రమాణం చేసి చెప్పగలవా? అని ఆయన నిలదీశారు. పోరాటం చేస్తానని చెప్పేది నువ్వే, ఒంటరిగా పోట ీచేస్తే వీరమరణం తప్పదని అనేది నువ్వేనని అన్నారు. తమ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తన తాత, తండ్రి, తాను ఎమ్మెల్యేనని, తండ్రి, తాను మంత్రినని గుర్తు చేశారు. పవన్ కు ఉన్నవి నారా వారి నరాలని అన్నారు. 2014 నుంచి 19 వరకూ డైరీలో ఆ పేజీలు లేవా? అని ప్రశ్నించారు.
ఇదేనా సంస్కారం?
రాజకీయ వ్యభిచారి గురించి మాట్లాడటం అంతకంటే అనవసరమని గుడివాడ అమరనాథ్ అన్నారు. 2024లో తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. అందరినీ తిడుతూ తనకు సంస్కారం ఉందని చెప్పుకుంటాడని అన్నారు. అంబటి రాంబాబును, తనను తిట్టినంత మాత్రాన కాపులకు నేతగా మారిపోతాడా? అని ప్రశ్నించారు. వంగవీటి రంగాను చంపిన వ్యక్తులకు కాపులను కలుపుతామని ఈయన తిరుగుతున్నాడని అమరనాథ్ ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్లు తిట్టి విమర్శలు చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఓపెన్ గా ఉన్నప్పుడే విలువ ఉంటుందన్నారు.
Next Story