Mon Dec 23 2024 00:08:26 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : రాజధాని అమరావతి పనులు నేడు ప్రారంభం
రాజధాని అమరావతి పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు
రాజధాని అమరావతి పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు పనులు ప్రారంభించనున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. సీఆర్డీఏ ఆఫీసు పనులను తొలుత పనులను ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సీఆర్డీఏ భవనాన్ని మొత్తం 160 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.
ఏడంతస్థుల భవనాన్ని...
మొత్తం ఏడంతస్థుల భవనాన్ని నిర్మించి అందులో సీఆర్డీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. తిరిగి అమరావతి పనులను ప్రారంభించేందుకు నిర్ణయించడంతో ముందుగా సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే ప్రత్యేక భవనాన్ని నిర్మించనున్నారు.
Next Story