Tue Dec 24 2024 01:11:44 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి రజనీ కారుకు ప్రమాదం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మార్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మార్కాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినప్పటికీ మంత్రి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. మార్కాపురం ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ వద్ద రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ముందు భాగం...
మార్కెట్ యార్డు ఛైర్మన్ వాహనం మంత్రి విడదల రజనీ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదే వాహనంలో ఉన్నారు. మంత్రి వాహనం ముందు బాగం దెబ్బతినింది. దీంతో వేరే వాహనంలో మంత్రి బయలుదేరి కార్యక్రమాలకు వెళ్లిపోయారు.
Next Story