Sun Dec 14 2025 03:52:42 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
అధికారుల విధులకు...
ఈ నెల 2వ తేదీన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

