Sun Dec 22 2024 18:03:09 GMT+0000 (Coordinated Universal Time)
దువ్వాడ, దివ్వెల పై తిరుమలలో కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై కేసు నమోదయింది. తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై కేసు నమోదయింది. తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు శ్రీవారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారంటూ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన తిరుమలకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దర్శనం అనంతరం ఫొటో షూట్ చేశారు.
ఆలయం ఎదుట రీల్స్...
ఆలయం ఎదుట రీల్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ కేసులో పేర్కొన్నారు. సహజీవనం చేస్తున్నామని మీడియాకు చెప్పడాన్ని కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని టీటీడీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story