Sun Dec 22 2024 07:17:52 GMT+0000 (Coordinated Universal Time)
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు
అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్యుతాపురం సెజ్ లో నిన్న రియాక్టర్ పేలి పదిహేడు మంది మరణించారు. అరవై మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం యాజమాన్యంపై పోలీసు కేసు నమోదు చేయాలని సూచించింది.
సెక్షన్లివే...
ఎసేన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించలేకపోవడం వంటి కారణాలతో కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ 106 (1), 125 (b), 125 (a) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్మికుల మరణానికి కారణమైనందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిారు.
Next Story