Mon Dec 23 2024 08:16:02 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది.
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది. ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెంటచింతల పోలీసులు తెలిపారు.
ఇప్పటికే ఈవీఎం...
అయితే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పది సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనను జూన్ 6వ తేదీ ఉదయం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
Next Story