Thu Dec 19 2024 14:54:51 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో మంకీపాక్స్ కేసు?
గుంటూరు లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతుంది. అయితే ఇది అనుమానిత కేసుగా వైద్యులు భావిస్తున్నారు
గుంటూరు లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతుంది. అయితే ఇది అనుమానిత కేసుగా వైద్యులు భావిస్తున్నారు. ఒంటిపై దుద్దర్లతో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. ఆ బాలుడి శరీరం పై దుద్దుర్లు ఉండటంతో మంకీపాక్స్ కేసుగా అనుమానిస్తున్నారు. వెంటనే బాలుడి రక్తనమూనాలను సేకరించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పరీక్ష కోసం పంపారు.
పదిహేను రోజులవుతున్నా.....
పదిహేను రోజులవుతున్నా దుద్దుర్లు తగ్గకపోవడంతో వైద్యులు మంకీపాక్స్ కేసుగా అనుమానిస్తున్నారు. బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. బాలుడి కుటుంబం ఉపాధి కోసం ఒడి శా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చింది. అయితే ఈ బాలుడికి మంకీపాక్స్ వచ్చే అవకాశాలు లేవన్నది వైద్యుల అభిప్రాయం. ముందు జాగ్రత్త చర్యగా రక్తనమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు.
Next Story