Wed Apr 23 2025 22:59:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత.. జగన్ సర్కార్ కు క్యాట్ ఝలక్
మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తి వేసింది.

మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తి వేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్ లో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. రెండోసారి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టింది.
జీతభత్యాలను కూడా...
వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుకు ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా, సస్పెన్షన్ కాలంలో జీత, భత్యాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో భారీ ఊరట లభించినట్లయింది.
Next Story