Sun Dec 22 2024 21:35:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పన్నెండు రోజుల పాటు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు పదిహేను రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ వేసుకున్నారు.
పదిరోజుల పాటు...
దీనిపై విచారించిన సీబీఐ కోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ను పన్నెండు రోజులు పాటు మంజూరు చేసింది. ఎస్కార్ట్ తో కూడిన బెయిల్ ను మాత్రమే ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానం నిర్ణయించింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డికి పన్నెండు రోజుల పాటు బెయిల్ లభించినట్లయింది.
Next Story