Mon Dec 23 2024 07:11:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. అనుమతి ఇవ్వవద్దంటూ
విదేశాలకు వెళ్లాలన్న జగన్ పిటిషన్పై తీర్పు ఈనెల 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది
విదేశాలకు వెళ్లాలన్న జగన్ పిటిషన్పై తీర్పు ఈనెల 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ తన వాదనలను వినిపించాలని కోర్టు కోరింది. ఈరోజు జరిగిన విచారణలో సీబీఐ పిటీషన్ వేసింది.
విదేశాలకు వెళ్లేందుకు...
జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వొద్దని సీబీఐ పిటిషన్ వేసింది. బెయిల్ షరతులను సడలించొద్దంటూ సీబీఐ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మే 15న జగన్ ప్రధాన కేసుల విచారణ ఉందని సీబీఐ తరుపున న్యాయవాదులు తెలిపారు. దీంతో ఇరువర్గాల వాదనలు పూరతయ్యాయి. తీర్పును ఈ నెల 14వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
Next Story