Mon Nov 18 2024 12:16:57 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. విచారణ నేడు కొనసాగుతుంది. గత కొద్ది నెలలుగా విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు ఇటీవలే న్యాయస్థానంలో ఛార్జి షీటు కూడా వేశారు. మరోసారి సీబీఐ అధికారులు ఈ హత్య కేసులో విచారణ ను ప్రారంభించారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. తమ విచారణలో వెలుగు చూసిన దాని ఆధారంగా అనుమానితులను తమ వద్దకు రప్పించుకుని విచారిస్తున్నారు.
పులివెందులకు చెందిన....
కడప జిల్లా జైలులో ఈ హత్య కేసులో ఈరోజు విచారణను ప్రారంభించారు. ఈరోజు పులివెందులకు చెందిన శ్రీనివాసులను ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దాదాపు వంద మందికి పైగానే అనుమానితులుగా భావించి విచారించారు. వీరిలో ఐదుగురిపై కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు. దస్తగిరిని అప్రూవర్ గా చేశారు. ఈరోజు నుంచి సీబీఐ అధికారులు మళ్లీ విచారణను ప్రారంభించారు.
Next Story