Fri Nov 22 2024 20:29:31 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ బృందం మరోసారి పులివెందులకు వెళ్లింది.
వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ బృందం మరోసారి పులివెందులకు వెళ్లింది. హత్య తర్వాత నిందితులు వెళ్లిన రూట్లలో సీన్ రీకనస్ట్రక్షన్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.
తొలిసారి పులివెందులకు....
2019 మార్చిలో వైఎస్ వివేకా హత్య జరిగింది. అయితే దీనిపై రెండు ప్రభుత్వాలు మారినా దర్యాప్తు సంతృప్తికరంగా లేదన్న విమర్శలు విన్పించాయి. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీంతో గత ఏడాదిన్నరగా సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో హత్యకు గల కారణాలను వెల్లడించింది. అయితే వివేకా కుటుంబ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో మరోసారి దర్యాప్తును వేగవంతం చేసింది. సీబీఐ బృందం తొలిసారి పులివెందులకు వెళ్లడం విశేషం.
Next Story