Mon Dec 23 2024 11:46:50 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ భాస్కర్‌రెడ్డికి మరోసారి నోటీసులు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 12న...
తొలుత భాస్కర్ రెడ్డికి గత నెల 23వ తేదీన విచారణకు రావాలని కోరినా, ముందస్తు కార్యక్రమాలతో తాను రాలేనని ఆయన తెలిపారు. దీంతో మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. వివేకా హత్య కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలపైనే ఎక్కువగా భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించే అవకాశముంది.
Next Story