Mon Dec 23 2024 16:04:58 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు
వైైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు
వైైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని రెండు సార్లు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోసారి ప్రశ్నించేందుకు రేపు విచారణకు రావాలని కోరారు. అయితే అవినాష్ రెడ్డి మాత్రం రేపు వీలుకాదని, మరో తేదీని సూచించాలని ఆయన కోరారు. కానీ సీబీఐ అధికారులు మాత్రం రేపు ఖచ్చితంగా హాజరు కావాలని కోరారు.
మరోసారి రావాలని...
ఈ మేరకు పులివెందుల ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందచేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల కాలంలో స్పీడ్ పెంచింది. వరసగా విచారణలు చేస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డిని మూడోసారి సీబీఐ అధికారులు విచారణకు రమ్మని కోరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తక్కువ కాలంలో మరోసారి ఎందుకు విచారణకు తిరిగి రమ్మన్నారన్న దానిపై పార్టీలోనూ, కడప ప్రాంతంలోనూ చర్చ జరుగుతుంది.
Next Story