Mon Dec 23 2024 03:30:31 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందులలో సీబీఐ
పులివెందులలో సీబీఐ బృందం పర్యటించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలించారు
పులివెందులలో సీబీఐ బృందం పర్యటించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఇంటిని మరోసారి క్షుణ్ణంగా సీబీఐ అధికారులు పరిశీలించారు. నిన్న వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో వివేకా ఇంటిని సీబీఐ అధికారుల పరిశీలిస్తున్నారని తెలిసింది.
అవినాష్ రెడ్డి ఇంటికి...
అలాగే పులివెందులలోని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వద్దకు కూడా సీబీఐ అధికారులు వెళ్లారు. అవినాష్‌రెడ్డి ఇంటి బయట పరిసరాలు పరిశీలించారు. అవినాష్‌రెడ్డి పీఏ రమణారెడ్డితో కొద్దిసేపు సీబీఐ అధికారులు మాట్లాడారు. తిరిగి వివేకా ఇంటికి చేరుకుని హత్య జరిగిన రోజు అవినాష్ ఎంతసేపటికి వివేకా ఇంటికి వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారని తెలిసింది
Next Story