Mon Dec 23 2024 07:14:49 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. హోంశాఖ సీరియస్
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోం శాఖ లేఖ పంపినట్లు తెలిసింది. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్లు ఎగురవేయడంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్‌షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‌గా ప్రకటించినా డ్రోన్లు ఎలా ఎగరగలిగాయాని లేఖలో ప్రశ్నించినట్లు తెలిసింది.
రోడ్ షో కు ముందు....
ప్రధాని బెజవాడలో ఇందిరిగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అందుకు ముందుగా ఎస్పీజీ అనేక చర్యలు తీసుకుంది. భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. అయితే ప్రధాని పర్యటన ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు డ్రోన్లను గుర్తించిన ఎస్పీజీ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదని ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని కేంద్ర హోం శాఖ భావిస్తుంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
Next Story