Thu Dec 19 2024 06:47:20 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
కేంద్ర ఎన్నికల సంఘం హరీశ్ కుమార్ గుప్తాను ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమించింది.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం హరీశ్ కుమార్ గుప్తాను రాష్ట్ర డీజీపీగా నియమించింది. హరీష్ గుప్తా 1992వ బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయనను నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేవించడంతో కొద్ది సేపటి క్రితం హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలను చేపట్టారు.
ముగ్గురి పేర్లలో...
గతంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాధ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఏపీ చీఫ్ సెక్రటరీ పంపింది. ఇందులో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. వీరిలో హరీష్ కుమార్ గుప్తా ను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
Next Story