Sat Dec 28 2024 19:50:22 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసేకు కు గుడ్ న్యూస్
జనసేనకు వచ్చే ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి బిగ్ గుడ్ న్యూస్ వచ్చింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉతర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఈ మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం అధికారులు కేటాయించనున్నారు. ఈసారి ఎక్కువ స్థానాల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుండటంతో గాజుగ్లాసు పార్టీకి చెందడం నిజంగా శుభసంకేతమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
గుర్తు గాజు గ్లాసు...
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి జనసేనకు గాజుగ్లాసు గుర్తును కేటాయించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు పైనే పోటీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఉత్తర్వులను జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ ఈరోజు పవన్ కల్యాణ్ కు అందించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈఉత్తర్వులతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story