Mon Dec 23 2024 03:48:35 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 22, 23 తేదీల్లో పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈ బృందం ప్రత్యేకంగా పరిశిలించనున్నట్లు తెలిసింది. దొంగ ఓట్ల పేరుతో అసలు ఓట్లను తొలగించారంటూ విపక్ష టీడీపీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది.
నేరుగా సీఈసీని కలిసి...
ఆరోపణలు చేయడమే కాకుండా నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ అధికారులు తమ పర్యటనలో భాగంగా రాజకీయ పక్షాలను కలవడంతో పాటు ఫిర్యాదులను స్వీకరించనున్నారు.
Next Story