Sun Nov 24 2024 08:09:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏడు ఈఎస్ఐ ఆస్పత్రులు మంజూరు !
ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని
అమరావతి : ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఏడు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో.. ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్ఐ ఆస్పత్రి, అలాగే విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మితమవుతాయని స్పష్టం చేసింది.
అదేవిధంగా.. కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేశామని, అవి ఇంకా భూసేకరణ దశలోనే ఉన్నాయని తెలిపింది. మూడు ప్రధాన ఈఎస్ఐ ఆసుపత్రులు పునర్నిర్మాణంలో ఉన్నాయని, రాజమండ్రి, విజయవాడ, విశాఖ జిల్లాలోని మల్కీపురంలో ఈఎస్ఐ ఆస్పత్రులు పునర్నిర్మాణ దశల్లో ఉన్నాయని, వాటి నిర్మాణ బాధ్యతలు సీపీడబ్ల్యూడీ శాఖకు అప్పజెప్పినట్లు కేంద్రం వివరించింది.
News Summary - Central Government Granted Seven ESI Hospitals for Andhra Pradesh
Next Story