Mon Dec 23 2024 13:56:32 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదా ఉనికిలోనే లేదు : కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధాంగా చెప్పింది
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధాంగా చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చామని తెలిపింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదాలు కలిగిన రాష్ట్రాలకు మధ్య పన్నుల పంపిణీ మధ్య తేడా చూపడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
పోలవరం పూర్తి కాదు...
పంజాబ్ చెందిన రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధనంగా ఈ విషయాలను చెప్పింది. ప్రణాళిక, ప్రణాళికేతర అంశాలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందన్నారు. 15వ ఆర్థిక సంఘం కూడా అదే సిఫార్సు చేసిందన్నారు. పోలవరం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని, అయితే గడువులోగా పూర్తయ్యే అవకాశాలు లేవని వైసీపీ రాజ్యసభ సభుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 13,226 కోట్లను పోలవరం ప్రాజెక్టుకు చెల్లించామని, 2,441.86 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని రాజ్యసభలో పేర్కొంది.
Next Story