Mon Dec 23 2024 04:34:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విభజన సమస్యలపై సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై చర్చించనున్నారు. విభజన చట్టంలోని అంశాలను కూడా చర్చకు వచ్చే అవకాశముంది. పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా హాజరుకానున్నారు.
అన్ని అంశాలతో....
విభజన చట్టంలోని షెడ్యూల్ 9 కింద ప్రభుత్వ కార్పొరేషన్లతో పాటు కంపెనీల విభజన, షెడ్యూల్ పది లోని సింగరేణి కాలరీస్ విభజన, నగదు బ్యాంకు నిల్వల విభజన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది. విభజన హామీల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం. వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story