Thu Nov 21 2024 22:22:31 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్.. భారీ ప్రాజెక్టు మంజూరు
కేంద్ర ప్రభుత్వం వరసగా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటుంది. అందులో భాగంగా గుడ్ న్యూస్ చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం వరసగా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటుంది. అందులో భాగంగా గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతికి మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అనేక నగరాలను కలుపుతూ ఈ రైలు మార్గం ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కృష్ణానది నుంచి ఈ రైలు లైన్ ఉంటుందని తెలిపారు. ఇందుకోసం 2,245 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై తో పాటు దేశంలోని మెట్రో నగరాలను కలుపుతూ ఏపీ రాజధాని అమరావతి మీదుగా ఈ రైల్వే లైన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మెట్రో నగరాలను కలుపుతూ...
ఈ రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీట్ల పొడవైన వంతెన నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్ర కేబెనెట్ లో నిర్ణయించారు. నిజంగా ఇది పూర్తయితే అమరావతి రాజధానికి మరింత సొబగులు చేకూరినట్లే. దీనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రానికి ఈ రైల్వే లైన్ మంజూరు కావడం సంతోషకరమని అన్నారు. త్వరలో ఈ రైల్వేలైన్ ను పూర్తి చేయడమే కాకుండా, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సూచించారు. కేంద్ర కేబినెట్ లో మరో కీలక నిర్ణయం కూడా ఏపీ విషయంలో తీసుకున్నారు. 252.42కోట్ల రహదారి నిర్మాణాలకు ఓకే చెప్పారు. రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు.
Next Story