Sun Dec 22 2024 15:01:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
మిచౌంగ్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం నేడు తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది.
మిచౌంగ్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం నేడు తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఈరోజు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనుంది. కరువు నివారణ చర్యల కోసం రూ.659కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది.
తుఫాను దెబ్బకు...
ఇటీవల కురిసిన మిచౌంగ్ తుఫానుకు దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాధమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు పది వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటనతో ఢిల్లీ నుంచి సాయం ఎంత అందుతుందా? అన్న దానిపై ఎదురుచూడాల్సి ఉంది.
Next Story